ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్‌లో గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ టైగా మారితే.. అర్ష్‌దీప్ సింగ్ అద్భుత బౌలింగ్‌తో శ్రీలంకను కట్టడి చేశాడు. మ్యాచ్‌లో అర్ష్‌దీప్ పెద్దగా ప్రభావం చూపలేదు. 4 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. సూపర్ ఓవర్‌లో మాత్రం అదరగొట్టాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి.. పెరీరా, శనకను అవుట్ చేసి హీరో అయ్యాడు.…