కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా కళ్యాణ్ రామ్ సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. సరిగ్గా ట్రైలర్ లాంచ్ సమయానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, ట్రైలర్ ఆన్ చేసి, త్వరగానే మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, “మళ్లీ ఎప్పుడు కనిపిస్తానో తెలియదు. ఒకసారి తనివితీరా మాట్లాడనివ్వండి. అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి…