గ్రామీ అవార్డులు 2022 వేడుక ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం ఈ వేడుక లాస్ వెగాస్‌లోని MGM గ్రాండ్ గార్డెన్ అరేనాలో జరిగింది. సినీ పరిశ్రమలోని ప్రముఖులు అత్యంత ఆకర్షణీయమైన అవతార్‌లలో రెడ్ కార్పెట్ పై కన్పించారు. ఈ సంవత్సరం కూడా ట్రెవర్ నోహ్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆసియా నుంచి ఈ వేడుకలకు హాజరైన ప్రముఖ సంగీత దిగ్గజాలలో ఏఆర్ రెహమాన్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.…