Home
Appsc Group 1
Appsc Group 1 News
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
ఏపీపీఎస్సీ గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టులో తుది విచారణ కొనసాగుతోంది. ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థుల తరఫు న్యాయవాదులు, ఎంపిక ప్రక్రియలో ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఉద్యోగాలకు ఎంపికైన 160 మంది అభ్యర్థుల ఓయమ్మార్ స్లిప్పుల్లో దిద్దుబాట్లు, ఓవర్రైటింగ్ ఉన్నాయని వారు వాదించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీ తన విధి నిర్వహణలో అన్ని రకాలుగా విఫలమైందని ఎంపిక కాని అభ్యర్థుల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. మూల్యాంకన… -
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
AP High Court: గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఏ ఆధారాలు, డాక్యుమెంట్లు ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికలు ఇచ్చిందో, ఆ ఆధారాలను, డాక్యుమెంట్లను అప్పీలుదారులకు ఇవ్వాలని హైకోర్టు సోమవారం రిజిస్ట్రార్ (జుడీషియల్)ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఆ రోజున పూర్తిస్థాయిలో వాదనలు వింటామని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ దొనడి రమేష్, జస్టిస్ అవధానం హరిహరనాథ… -
CM Chandrababu: గ్రూప్-1 నియామకాల్లో భయంకరమైన అక్రమాలు.. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు
CM Chandrababu: అసెంబ్లీలో గ్రూప్-1 నియామకాల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్షలు, నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా కాకుండా అక్రమ పద్ధతుల్లో ఉద్యోగాల భర్తీ జరిగిందని విమర్శించారు. గ్రూప్-1 వ్యవహారంలో కోర్టును కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కోర్టును తప్పుదారి పట్టించేందుకు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని అన్నారు. పేపర్ల మూల్యాంకన బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి… -
AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
AP Assembly 2026 Four Day Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్ అధ్యక్షత బీఏసీ సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం చంద్రబాబు సహా పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణు కుమార్ రాజు, జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలను మొత్తం నాలుగు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. 20వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సభా… -
CM Chandrababu: డీఎస్సీపై కౌంటర్ ఎటాక్.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
CM Chandrababu: డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. అర్హులకు ఉద్యోగాలు రాలేదని తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. వీటిపై ఏపీ ప్రభుత్వం అధికారుల నుంచి కౌంటర్ ఇప్పించింది. మంత్రులు కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. పదే పదే వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే గ్రూప్-1పై సిట్ నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం డీఎస్సీకి కౌంటర్‌గా గ్రూప్-1ను తెరమీదకు తెస్తోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1… -
AP High Court: గ్రూప్-1 అక్రమాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
AP High Court: గ్రూప్-1 అక్రమాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారిని అధిపతిగా నియమించి సిట్‌ను ఏర్పాటు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు నిష్పాక్షికంగా సాగేందుకు రాష్ట్రం వెలుపల ఉన్న ఫోరెన్సిక్…
తాజావార్తలు
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
-
Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!