వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు నైరుతి రుతుపవనాలు ముందుగానే విస్తరించే అవకాశం ఉన్నా. ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. అయితే.. నిన్న మండపేటలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. పడమర నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఎండలు పెరిగినట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే, నిన్న వడగాల్పులు వీచాయి. ఆకాశం నిర్మలంగా ఉండడం, వర్ష సూచన లేకపోవడంతో కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో వడగాలులు వీచినట్టు…