అగ్రరాజ్యం అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విద్యార్థి ముత్తిన రమేష్ గుండెపోటుతో మృతిచెందాడు. రమేష్ యూఎస్‌లో ఎమ్మెస్ డిగ్రీ చదువుతున్నాడు. మృతుడు నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకు చెందిన వాసిగా గుర్తించారు.