ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.. సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ (ఎక్స్)లో టెన్త్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. 2025 మార్చి 17వ తేదీ నుంచి 31 తేదీ వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు..