మందుబాబులకు పండుగ వేళ గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు తగ్గుతున్నాయి. కూటమి నేతలు ఎన్నికల సమయంలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చారు. అందులో భాగంగానే 99 రూపాయలకే క్వార్టర్ మద్యం విక్రయిస్తున్నారు. దీనికి భారీ డిమాండ్ ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.