ఏపీలో ఓ వైపు పీఆర్సీ రగడ నడుస్తుండగానే ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దీనిపై ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల చెల్లింపుల పై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. జీతాల చెల్లింపు ప్రాసెసింగ్‌కు కూడా ఇవాళే డెడ్ లైన్ ఉంది. దీంతో ఆర్థిక శాఖ శర వేగంగా పీఆర్సీ బిల్లులను సిద్ధం చేస్తోంది. నిన్న, మొన్న ఉద్యోగుల జీతాల బిల్లులు అప్లోడ్ చేసిన ట్రెజరీ శాఖ ఉద్యోగులు. Read Also:…
ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలను చల్లబరిచే ప్రయత్నం చేశారు సీఎం జగన్. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ అదిరే శుభవార్త అందించారు. పీఆర్సీ వల్ల హెచ్ ఆర్ఏ తగ్గిందని భావించే ఉద్యోగులకు ఉద్యోగుల హౌస్ రెంట్ అలవెన్స్ ని రెట్టింపు చేసేసింది. విజయవాడ పరిసరాల్లో ఉన్న హెచ్ఓడీ కార్యాలయాల్లోని ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ జోవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన ఉద్ధృతం చేసిన తరుణంలో.. ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ…
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. పీఆర్‌సీ విషయంలో గత కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీఆర్‌సీని 23.29 శాతం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ అమలుకానున్నట్లు తెలిపింది. పెండింగ్ డీఏలు…
ఏపీలో పీఆర్సీ అంశం కీలకంగా మారిన సంగతి తెలిసిందే. పీఆర్సీ పై సీఎం జగన్ అధికారిక ప్రకటన చేయనున్నారు. ఉద్యోగులు అడుగుతున్నంత కాకపోయినా వారు ఆనందంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇప్పటికే పేర్కొన్నారు. ఉద్యోగులు సహజంగా వాళ్ళ డిమాండ్స్ చేశారని, అన్నిటినీ పరిగణలోకి తీసుకుని సీఎం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన వెల్లడించారు. ఇదే విషయాన్ని ఇప్పటికే సీఎం ఉద్యోగులకు చెప్పారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం ఉత్తమమయిన మార్గం వెల్లడిస్తారన్నారు.
ఏపీలో అధికారులు, ఉద్యోగుల మధ్య పీఆర్సీ పీటముడి వీడడం లేదు. కాసేపట్లో ప్రారంభం కానుంది పీఆర్సీ పై కీలక సమావేశం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు ప్రభుత్వ సలహాదారు సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు శశిభూషణ్, రావత్. అనంతరం సీఎంతో భేటీ కానుంది అధికారుల బృందం. ఐఆర్ 27 శాతం ఇస్తున్న నేపథ్యంలో దీని కంటే ఎక్కువ ఫిట్ మెంట్ ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అదనపు…
ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమయిన అన్యాయం జరగకుండా చూస్తామని, పీఆర్సీ విషయంలో కాస్త ఓపికతో వుండాలన్నారు రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ. విజయనగరం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఇప్పటికే పలుమార్లు ఉద్యోగులతో చర్చలు జరిపామన్నారు మంత్రి బొత్స. ఐ.ఆర్. సైతం ప్రకటించామని తప్పకుండా వారి సమస్యలు పరిష్కరిస్తాం అన్నారు. ఈ…