ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లి రైతును ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచే రైతుల నుంచి క్వింటాకు రూ.1200 చొప్పున ఉల్లిని కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని అధికారులకు సూచించారు. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని.. ఉల్లిని ఆరబెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై సచివాలయంలో సంబంధిత అధికారులతో సీఎం…