ప్రజల ఐదేళ్ల కష్టాలకు రేపటితో అడ్డుకట్ట పడనుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీపై వైఎస్సార్‌సీపీ అనర్హత వేటు వేసింది. ఈ మేరకు సోమవారం శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు.
తప్పుడు సర్వేలు చూసుకుని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.. టీడీపీ సంబరాలు తాత్కాలికం మాత్రమే.. అసలు సంబరాలు రేపు మేం చేస్తాం అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈసీ నిబంధనలు తప్పుబట్టిన ఆయన.. ఈసారి ప్రతిదీ నిబంధనలకు విరుద్ధంగానే ఈసీ చేస్తుంది.. ఈసీపై చంద్రబాబు కంట్రోల్ ఉందని తెలిసిపోతుంది.
కౌంటింగ్ రోజున విజయోత్సవాలకు ఎలాంటి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.. ఏపీ సీఈవో ఎంకే మీనా.. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. 92 శాతం మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. రేపు ఉదయం ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా హాల్స్ ఏర్పాటు చేశాం. ప్రత్యేక ఏర్పాట్లు ఉన్న చోట ఈవీఎంలు కౌంటింగ్ కూడా 8 గంటలకే…
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ.. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని పేర్కొన్న డీజీపీ.. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, పీడీ యాక్ట్ ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు విధించింది సుప్రీంకోర్టు.. ఎమ్మెల్యే పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంపై ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు నంబూరు శేషగిరిరావు.. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్ కు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేసింది.
AP Election Results Counting Updates: మరో మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పలితాలు వెల్లువడగా కౌంటింగ్ కేంద్రాలు చుట్టూ భారీ భద్రతో కొనసాగుతున్న ఏర్పాట్లు. ఏకంగా 9 డ్రోన్లతో 3km చుట్టూ రెడ్ జోన్ పరిధిగా పరిగణిస్తామని అలానే సెక్షన్ 144, 30 అమలులో ఉంది అని ర్యాలీలు, ధర్నాలు నిషేదించాలని సమస్యాత్మిక ప్రాంతాలలో బలగాలు మరి ఇంత రెట్టింపు చేస్తున్నాము అని అనంతపురం ఎస్పీ గౌతమ్ శాలి చెప్పుకొచ్చారు. మరి ఇంత సమాచారం…