మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు.. ఇవాళ్టికి బదులుగా ఎల్లుండి సమావేశం నిర్వహించనున్నారు.. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది..
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని కొన్ని నిబంధనల కారణంగా భూ ఆక్రమణల్లో కేసుల నమోదుకు ఇబ్బందులు వస్తున్నట్టు ఇప్పటికే గుర్తించారు.
మంత్రులతో చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు.. మంత్రులు ప్రో యాక్టివ్ గా పని చేయలని స్పష్టం చేశారు.. మంత్రులు స్పీడ్ పెంచాలి, అదే సమయంలో సమర్ధంగా పని చేయాలంటూ మంత్రులకు క్లాస్ తీసుకున్నారు చంద్రబాబు.. ఇక నుంచి ప్రతిరోజు ముఖ్యమేనంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.. మంత్రులు కూడా తనతో సమానంగా పని చేయగలగలన్న చంద్రబాబు.. ఇంకా కొందరు నిర్లిప్తంగా ఉన్నారని.. ఇలా ఉంటే పని చేయలేరంటూ మంత్రులకు హితవు చెప్పారు.
కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.. చెత్తపన్ను రద్దు అమలు విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఇక, మహిళలకు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకంపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ సాగింది.. మరోవైపు.. దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్యను 15 నుండి 17 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్.. ఇద్దరు బ్రాహ్మణులు పాలకమండలిలో ఉండాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది..
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇవాళ జరుగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకం విధి విధానాలకు ఆమోద ముద్ర వేయనుంది. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం లబ్ధిదారులు, పథకానికి అర్హుల ఎంపిక, ఆర్థిక భారం వంటి అంశాల పైన చర్చించి అర్హుల…
రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలకమైన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకం విధి విధానాలకు ఆమోద ముద్ర వేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీకానుంది.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు..
రేపు సచివాలయంలో జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలో ప్రభుత్వ నూతన పాలసీలు చర్చకు రానున్నాయి. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నూతన పారిశ్రామిక విధానంలో ప్రణాళికలను రచించారు.
ఏపీ సచివాలయంలో రేపు(అక్టోబర్ 16) ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. కీలకమైన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలిసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.