అది ఆంధ్రప్రదేశ్ అయినా.... ఉత్తరప్రదేశ్ అయినా... బీజేపీకి ఉన్న ముద్ర మాత్రం అగ్రవర్ణాల పార్టీ అని. అందులోనూ భేషజాలు లేకుండా చెప్పుకోవాలంటే... బ్రాహ్మణుల పార్టీ, ఉత్తరాది పార్టీ అని కూడా అంటారు. ఇప్పుడు ఏపీ బీజేపీ ఈ ముద్రనే చెరిపేసుకునే దిశగా అడుగులేస్తోందట. అగ్రవర్ణ ముద్రను పోగొట్టి... బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్య పార్టీగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.