CM Chandrababu: అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు మరోసారి ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయంపై స్పందించారు. వచ్చే నెల 4న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.. ఆటో డ్రైవర్లు పెండింగ్ చలాన్‌లు ఉంటే క్లియర్ చేస్కోవాలని సూచించారు. అక్టోబర్ 4న సాయంత్రం 4 గంటలకు వాహనమిత్ర ద్వారా 15 వేలు ఆటో డ్రైవర్లకు అందజేస్తామన్నారు. ప్రతి నెలా 1న పెన్షన్ ఇచ్చేటప్పుడు ఉండే తృప్తి చెప్పలేనిదన్నారు..