యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం “అనుభవించు రాజా”. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ఫై సంయుక్తంగా ఈ కామిక్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించాయి. రామ్ చరణ్ తాజాగా “అనుభవించు రాజా” టీజర్‌ను ఆవిష్కరించారు. టీజర్ బాగుందంటూ ప్రశంసించిన చరణ్… సినిమా హిట్ కావాలని కోరుకుంటూ చిత్రబృందానికి విషెస్ చెప్పారు. ఈ టీజర్ సరదాగా, వినోదభరితంగా ఉంది. కోడిపందాలకు ప్రసిద్ధి చెందిన భీమవరం నేపథ్యంలో “అనుభవించు రాజా” తెరకెక్కింది. రాజ్ తరుణ్ ఇందులో పూర్తి జూదగాడు…