కెన్యా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పన్నుల విధానంతో దేశ అట్టుడికింది. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవ్వడంతో పరిస్థితులు చేయిదాటి హింసాత్మకంగా మారింది. పోలీసులకు-నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణతో పరిస్థితులు మొత్తం రణరంగంగా మారాయి
పన్ను వ్యతిరేక నిరసనలతో కెన్యా అట్టుడికింది. మంగళవారం పార్లమెంట్ కొత్త పన్నుల విధానాన్ని ఆమోదించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున పార్లమెంట్ ముట్టడికి యత్నించారు.