Tehreek-e-Hurriyat: కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ ‘తెహ్రీత్-ఎ-హురియత్(TeH)పై కేంద్రం ఉక్కుపాదం మోపింది. భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న ఈ సంస్థపై కేంద్రం నిషేధం విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద తెహ్రీక్-ఎ-హురియత్ (TeH)ని 'చట్టవిరుద్ధమైన సంఘం'గా కేంద్రం ఆదివారం ప్రకటించింది. ఈ సంస్థకు గతంలో వేర్పాటువాద నాయకుడు, మరణించిన సయ్యద్ అలీ షా గిలానీ నేతృత్వం వహించాడు.