తెలుగు సినిమా పాట అనగానే పల్లవి, కొన్ని సార్లు అనుపల్లవి ఆ తరువాత రెండు లేదా మూడు చరణాలు ఉండడం ఆనవాయితీ. ఇది మన దగ్గరే కాదు, పాటలతో చిందులు వేయించే ప్రతీచోటా ఉంటుంది. ఇలాంటి పదకవితలకు ఆద్యుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. అందుకే ఆయనను పదకవితాపితామహుడు అన్నారు. ఆయన పంథాలో పయనించని తెలుగు సినిమా రచయితలు లేరనే చెప్పాలి. అన్నమయ్య ఏర్పరచిన బాటలోనే తెలుగు సినిమా వెలుగు చూసిన తొలి రోజుల్లో పాటలు సాగాయి. అంటే ప్రాస,…