బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా (65) ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం బాంద్రాలోని తన ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. అనిల్ అరోరా మరణించిన సమయంలో పుణెలో ఉన్న మలైకా.. విషయం తెలిసిన వెంటనే ముంబై చేరుకున్నారు. ఘటన జరిగిన చోట ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అనిల్ అరోరా మృతికి సరైన కారణాలు తెలియరాలేదు. అయితే ఆత్మహత్య చేసుకునేముందు ఆయన తన కుమార్తెలకు ఫోన్ చేసి…