ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ శుక్రవారం రిలీజ్ అవుతోంది. అయితే ఏపీలో ఈ మూవీ టిక్కెట్ రేట్లపై తొలుత సందిగ్ధత నెలకొంది. ఏపీలో 20 శాతం షూటింగ్ జరిపిన సినిమాలకే టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాధేశ్యామ్ షూటింగ్ 20 శాతం మేర జరపకపోవడంతో ఈ సినిమా టిక్కెట్ రేట్లపై ఎలాంటి నిర్ణయం వస్తుందో అని గురువారం సాయంత్రం వరకు ఆన్లైన్లో కూడా టిక్కెట్ల విక్రయాలు ప్రారంభం కాలేదు. ఈ…
ఏపీలో ఇటీవల ఖాళీ అయిన ఓ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు ఇటీవల నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన మహ్మద్ కరీమున్నిసా మరణించగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇటీవలే ఈసీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థిగా కరీమున్నిసా కుమారుడు రుహుల్లా నామినేషన్ దాఖలు చేశారు.…
సినిమా థియేటర్లకు విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి లేఖ రాయడం ఆంధ్రప్రదేశ్‌లో చర్చగా మారిపోయింది… కొత్తి సినిమా విడుదలైన సందర్భంగా తమకు ప్రతీ షోకి వంద టికెట్లు ఇవ్వాలని లేఖలో థియేటర్ల యాజమాన్యాలను కోరారు మేయర్… కొత్త సినిమా రిలీజ్ అయిన సమయంలో ఒక రకంగా తమకు ఎదురైయ్యే ఇబ్బందులను కూడా లేఖలో పేర్కొన్నారామె.. ప్రతీ నెల కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయని.. అయితే, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సినిమా థియేటర్లలో టికెట్లు కావాలని పార్టీ ప్రతినిధులు,…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పట్లో చంద్రబాబుతో జతకట్టి చేతులు పైకెత్తిన పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో కళ్లు తేలేశాయని.. చంద్రబాబు ఐరన్ లెగ్ కారణంగానే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ పార్టీ కళ్లు తేలేసిందని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. యూపీలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీతో మళ్లీ జత కట్టేందుకు చంద్రబాబు చూస్తున్నారంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీంతో అఖిలేష్‌తో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటుంది.. వైసీపీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. ఇప్పటికే ఇక్కడ్నుంచి రెండుసార్లు విక్టరీ కొట్టారు ఆర్కే రోజా. అయితే, పార్టీలోని అంతర్గత విభేదాలు ఎన్నో సార్లు గుప్పుమన్నాయి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రోజాపై ఆమె వ్యతిరేక వర్గం తిరుగుబాటు చేయడం చర్చగా మారింది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గం పోరు ఆసక్తిగా మారేలా కనిపిస్తోంది. ఎంతకంటే..? ఇప్పుడు…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అవమానించి టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు సభకు ఎందుకు రావడం లేదో ఆయనకే తెలియడం లేదని సెటైర్ వేశారు. అసలు టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏంటని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు గత పాలనను ప్రజలు ఛీకొట్టారన్న జగన్.. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ప్రజా సంక్షేమ పథకం ఒక్కటైనా…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమైంది… ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చర్చనుప్రారంభించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో కూడా ఆర్థిక ప్రగతి బాగానే ఉందన్నారు.. కరోనా సమయంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు కూడా అందించామని.. పేదరికాన్ని తగ్గించాలంటే విద్యతోనే సాధ్యం.. అందుకే విద్యకే అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకం కూడా లేదంటే…
మేషం :- దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు స్వీయార్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. ప్రేమికులు పెద్దల నుంచి చికాకులను ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. వృషభం :- స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. ఉద్యోగస్తులు అధికారుల మనస్థత్వం తెలిసి మసలు కొనుట మంచిది. వ్యాపార వర్గాల వారికి పెద్దమొత్తంలో చెక్కులిచ్చే విషయంలో…
జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది పార్టీ.. ఇవాళ ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీలతో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల భేటీ అయ్యారు.. సభకు వచ్చే వారి రవాణా, పార్కింగ్ ఏర్పాట్ల పైనే ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సూచించారు.. సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.. అయితే, జనసేన ఆవిర్భావ సభకు ప్రభుత్వం అనుమతి వస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం చేసిన జనసేన పార్టీ నేతలు.. అవసరం అయితే, హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం…
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, ఆ వివాదాల పరిష్కారానికి కొన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం మరోసారి భేటీ కానుంది… రేపు ఉదయం వర్చువల్ విధానంలో కమిటీ సభ్యులు సమావేశం కాబోతున్నారు.. తెలంగాణ, ఏపీ మధ్య నీటి కేటాయింపులపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ సాగనుంది.. ఆ నీటిని వినియోగించుకోవద్దు, నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి…