Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులపై అధికారులు చర్యలు చేపట్టారు. క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తూ ఉద్యోగ నియమాలను ఉల్లంఘించినట్లు విజిలెన్స్ అధికారుల నివేదికలో పేర్కొనడంతో, వారిపై టీటీడీ ఈవో సస్పెన్షన్ వేటు వేశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేటుగా నవగ్రహ శాంతి పూజలు నిర్వహించిన వ్యవహారంలో ఆలయ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 29వ తేదీన శ్రీకాళహస్తి పట్టణంలోని సన్నిధి వీధిలో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీకాంత్ కుటుంబం నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. ఈ పూజలను శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో పనిచేసే కొందరు అర్చకులు, వేద…