రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రంతో పరస్పర సహకారంతో సమాఖ్య స్ఫూర్తి కొనసాగేలా మా వంతుగా కృషి చేస్తాము అని నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు అభినందనీయం, ఆదర్శప్రాయం. దేశంలో తొలిసారిగా వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ విషయంలో నాకెంతో నమ్మకం ఉంది. గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు. వ్యవసాయానికి అండ, రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ, వికేంద్రీకరణ ప్రక్రియలు…