విద్యార్థులకు అలర్ట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లకు సెలవు. ప్రైవేట్ స్కూళ్ల బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్స్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేటు పాఠశాలలపై తీసుకుంటున్న ఏకపక్ష చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను మూసివేసినట్లు యాజమాన్యాల సంఘాలు ప్రకటించాయి. ఈ నిర్ణయం తమ ఆవేదనను తెలిపేందుకే తప్ప.. ప్రభుత్వానికి అస్సలు వ్యతిరేకం కాదని వెల్లడించాయి. స్కూళ్ల బంద్‌తో సమిష్టి ఐక్యతను అందరి దృష్టికి తీసుకెళ్లే చిరు ప్రయత్నం మాత్రమే అని…