Kiran Kumar Reddy Mocks Rahul Gandhi : రాయచోటిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు.. రోజు రోజుకి రాహుల్ గాంధీ తెలివి ఏమైందో అర్థం కాలేదన్నారు.. ఆటంబాంబు పేలు స్థానం అన్నారు... అది తుస్సు మని పోయిందని విమర్శించారు.. కేంద్రంలో బీజేపీ రిగ్గింగ్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ తో మూలాఖాత్ అయి ప్రభుత్వం మూడోసారి వచ్చిందని చెప్తారని.. కొంచమైనా తెలివి ఉపయోగించాలి…
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. దేశంలో ఇంత ఘోరంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు.. ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని నిద్ర నటిస్తోంది.. నిద్రపోయేవాడిని నిద్రలేపొచ్చు.. కానీ, నిద్ర నటించే వారిని ఏమీ చేయలేమన్నారు. ఎన్నికల కమిషన్ సీట్లో కూర్చున్నవాళ్లే ఇలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం ఎలా బ్రతుకుతుంది అని ప్రశ్నించారు.
టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, NDAలో కీలక నాయకుడిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ, ఆయన తన కమిట్మెంట్స్ కారణంగా నట జీవితాన్ని పూర్తిగా వదులుకోలేక పోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్ర షూటింగ్‌ను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. ఈ సినిమాలో ఆయన పోలీసు అధికారిగా నటిస్తున్నారు, శ్రీ లీల, రాశి ఖన్నా కథానాయికలు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలకు…
High Tension In Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తుండటా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అల్లూరి జిల్లాలో సీఎం నిర్వహించే సభలో వినతి పత్రం ఇచ్చేందుకు ర్యాలీగా వెళుతున్న పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజును పోలీసులు అడ్డుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పర్యటనలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒకటో తారీకు వస్తే పండగ వాతావరణం నెలకొంటుందని.. వైసీపీ పాలనలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేందుకు ఐదేళ్లు పట్టిందన్నారు. జగన్ పింఛన్లు పెంచుతామని ప్రజలను మోసం దగా చేశారని.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి విషమంగా ఉన్న పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్నామని తెలిపారు. ఏడాది పాలనలో పెద్ద ఎత్తున అభివృద్ధి…
సోనీ లివ్ నుంచి రాబోతోన్న ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ఇప్పటికే సెన్సేషన్‌గా మారింది. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇక ‘మయసభ’ టీజర్‌ను వదిలినప్పటి నుంచి ఈ సిరీస్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఈ సిరీస్‌ను ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోన్నారు.…
ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు రిలీఫ్ లభించింది. మచిలీపట్నం పోలీసులు కొడాలి నాని పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కొడాలి నానిపై కేసు నమోదైంది. కేసు క్వాష్ చేయాలని కొడాలి నాని పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. గుంటూరు మిర్చి యార్డులో పర్యటనలో ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, అప్పిరెడ్డి పై కేసు నమోదు కాగా... హైకోర్టులో క్వాష్ పిటిషన్…
రోడ్డు రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైసీపీ పార్టీపై నిప్పులు చెరిగారు. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు చంద్రబాబు శ్రమిస్తున్నారన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ… రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. సింగపూర్ లాగా అమరావతిని అభివృద్ధి చేస్తామని పదేళ్ల ముందే మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇందుకు అనుగుణంగా సింగపూర్ ప్రభుత్వ ఆర్కిటెక్ లతో అద్భుతమైన డిజైన్ చేయించారన్నారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వేల కోట్ల…