ఒంటిమిట్టలో నామినేషన్ వేసిన దగ్గర్నుంచి టీడీపీ ముగ్గురు మంత్రులు సవిత, జనార్ధనరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి ప్రలోభాలకు గురిచేశారని ఒంటిమిట్ట వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఆరోపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నిక మొదలవుతుండగానే మా పార్టీకి చెందిన ఏజెంట్లను ఇబ్బంది పెట్టారు.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు.