జెమిని టీవిలో ప్రసారం అయ్యే “మాస్ట్‌ర్ చెఫ్” కార్యక్రమానికి తమన్నా భాటియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఈ కార్యక్రమానికి బాగానే ఆదరణ వచ్చిన ఆ తర్వాత ఎందుకో అంతగా ఆదరణకు నోచుకోలేదు. దీంతో తమన్నా స్థానంలో బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్‌ను తీసుకున్నారు. దీంతో తమన్నా ప్రొడక్షన్ హౌస్‌కు షాక్ ఇచ్చింది. తనను తొలగించడంపై అసంతృప్తితో ఉన్న ఈ ముద్దుగుమ్మ తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్‌కు లీగల్ నోటీసులు పంపించిందని సమాచారం.
యాంకర్ అనసూయ అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సత్తా చాటుతోంది. రీసెంట్ గా ఆమె ప్రధానపాత్రలో ‘థ్యాంక్యూ బ్రదర్’ నటించింది. ఇందులో అనసూయ పాత్ర విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అశ్విన్ విరాజ్ కీలకపాత్రలో నటించారు. నూతన రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. మే 7న ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను ‘ఆహా’ సంస్థ విడుదల చేసింది. లాక్‌డౌన్‌లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎలా చిత్రీకరించారనే…