ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మధ్య ఉప్పు నిప్పులా ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఓపెన్‌గానే విమర్శలు చేసుకుంటున్నారు నాయకులు. ఇప్పుడు మంత్రుల బస్సుయాత్ర సైతం జేసీ, పల్లెల మధ్య మాటల మంటలు రాజేస్తున్నాయి. వాటి చుట్టూనే ప్రస్తుతం రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జిల్లాకు వచ్చారు. ఆ సమయంలో వేదికపై జేసీ…
బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. స్వామికార్యం.. స్వకార్యం అన్నట్టుగా గేర్ మార్చేశారు. అలజడులు.. విభేదాలతో సాగుతున్న తెలుగు తమ్ముళ్లను సెట్‌రైట్ చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో కూడా చంద్రబాబు జిల్లాకు వచ్చినా.. ఈ దఫా కాస్త భిన్నంగా పర్యటన సాగడం.. స్పీచ్‌లు ఉండటం చర్చగా మారింది. పార్టీ టికెట్ ఇచ్చే విషయంలో చంద్రబాబు ప్రకటన.. జిల్లాలో కొందరు నేతలకు ఉత్సాహాన్ని ఇస్తే.. మరికొందరిలో తీవ్ర నిరాశ.. నిస్పృహలు నింపాయట. దీనికితోడు జిల్లా…
ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు ఉన్నా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధాన పార్టీలలో హడావిడి మొదలైంది. సీట్ల మార్పులు చేర్పులపై చర్చలు జోరందుకున్నాయి. ఈ తరహా చర్చలు టీడీపీలో కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ప్రత్యేకించి సీనియర్లలో చాలా టెన్షన్ కనిపిస్తోందట. దశాబ్దాలుగా టీడీపీలో ఉంటూ పదవులు పొందిన నాయకుల సీటుకే ప్రస్తుతం ఎసరు వచ్చినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయట. దానికి తగ్గట్టుగానే అధినేత చంద్రబాబు కామెంట్స్ ఉంటున్నాయట. ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్లు.. చంద్రబాబుతోపాటు..…
స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరిగాక పిల్లలమీద ఒక కన్నేసి వుంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్‌లైన్ గేమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు, వైద్యులు మొత్తుకుంటున్నా వారిలో మార్పు మాత్రం రావడం లేదు. లాక్ డౌన్‌తో ఇళ్లకే పరిమితం కావడంతో గేమ్స్ పిచ్చిలో పడి.. పిల్లలు ఇప్పుడు బయటకు రాలేకపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మొబైల్ చేతిలో పట్టుకుని అదే మాయలో ఉంటున్నారు.అనంతపురం జిల్లాలో పబ్జీకి బానిసై అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడో బాలుడు. ఈ గేమ్‌కు బానిసైన…