తాడిపత్రిలో ఆటవిక రాజ్యం నడుస్తోంది అని ఆరోపించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.. పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.. కానీ, హైకోర్టు ఆదేశాలు వచ్చి రెండు మాసాలైనా పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదని మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.