ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయం పంచుకున్నారు. నెల్లూరులో తనకు ఇంటర్ సీటును దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఇప్పించారని తెలిపారు. తాను ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కాబట్టి.. ప్రకాశం, నెల్లూరు సహా ఐదారు జిల్లాలో తిరిగానని చెప్పారు. ప్రకాశం జిల్లా అంటే గుర్తుకు వచ్చేది ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని పేర్కొన్నారు. సైమన్ కమిషన్‌కి ఎదురొడ్డి నిలిచిన ధైర్యవంతుడు ప్రకాశం పంతులు అని పవన్…