India-US Relations: భారతదేశంపై ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ట్రంప్ 50 శాతం సుంకాలను విధించారు. దీనిపై అమెరికాలోనే వ్యతిరేకత వస్తోంది. భారత్ వంటి మిత్రదేశాన్ని దూరం చేసుకుంటోందని ట్రంప్ పరిపాలను అమెరికా నిపుణులు తిట్టిపోస్తున్నారు. అయితే, ఇప్పుడు భారత్‌కు మరో అనూహ్య మద్దతు లభించింది. భారతదేశంపై అమెరికా అధికారులు విమర్శలు పెంచుతున్న నేపథ్యంలో, వీటిని ఆ దేశంలోని యూదుల కమిటీ ఖండించింది.