మధ్యప్రదేశ్ అమర్‌కంటక్‌లోని నర్మదా ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేశారు. అందులో స్త్రీలు, పురుషులు మంచి దుస్తులతో ఆలయ ప్రాంగణానికి రావాలని తెలిపారు. పొట్టి బట్టలు, హాఫ్ ప్యాంట్, బెర్ముడా, నైట్ సూట్, మినీ స్కర్ట్, చిరిగిన జీన్స్ మరియు క్రాప్ టాప్ వంటి దుస్తులు ధరించి వచ్చిన వారికి ఆలయంలోకి ప్రవేశం నిషేధించారు.