గత కొన్ని రోజులుగా పంజాబ్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రానున్న ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో పంజాబ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పాటియా లా నుంచి పోటీ చేస్తానని తెలిపారు. నేను పాటియాలా నుంచి పోటీ చేస్తాను.. పాటియాలా 400 ఏళ్లుగా మాతోనే ఉందని, సిద్ధూ వల్ల నేను దానిని వదిలిపెట్టబోనని…
పంజాబ్‌లో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ప్రకటించారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో పార్టీని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పార్టీని నడిపించబోతున్నట్టు కెప్టెన్ తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాదు, 7 పేజీలతో కూడిన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు పంపారు. మరి కొన్ని నెలల్లో పంజాబ్‌లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్తపార్టీని ఏర్పాటు చేసిన అమరీందర్ సింగ్…
పంజాబ్‌లో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ఇప్పటికే కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని అనూహ్యమైన కారణాల వలన అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేసిన తరువాత ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరి పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే, గత కొంతకాలంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా సిక్కు రైతులు పోరాటం చేస్తున్నారు. పంజాబ్…
పంజాబ్ లో కొత్త పార్టీ అవతరించబోతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు, ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారని, పార్టీని స్థాపించిన తరువాత వారంతా తమతో కలిసి వస్తారని అమరీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు పెద్ద…
పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తిరేపుతూనే ఉన్నాయి.. కాంగ్రెస్ పార్టీలో కుంపటితో బయటకు వచ్చిన పంజాబ్ మాజీ సీఎం, సీనియర్ పొలిటికల్ లీడర్ అమరీందర్ సింగ్.. త్వరలో పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు.. అంతేకాదు బీజేపీతో పొత్తు కూడా ఉంటుందని స్పష్టం చేశారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం పార్టీ ఏర్పాటుపై.. అమరీందర్ సింగ్ మీడియా అడ్వైజర్ రవీన్ థక్రల్ ట్వీట్ చేయడం హాట్ టాపిగ్గా మారింది. తమతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న పార్టీలను,…
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో కొనసాగలేను.. బీజేపీలో చేరను అని ప్రకటించిన అమరీందర్.. మరో 15 రోజుల్లో కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉంది. కెప్టెన్ అమరీందర్‌తో ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,రైతు నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కొత్త పార్టీకి.. పంజాబ్ వికాస్ పార్టీ అని పేరు పెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్,ఆప్, అకాలీదళ్ అసంతృప్త నేతలను అమరీందర్ కూడగట్టే ప్రయత్నాలు…
చాలా కాలంగా పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఈ కుమ్ములాటల కారణంగా అమరీందర్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. రాజీనామా చేసిన తరువాత ఢిల్లీ వెళ్లివచ్చిన ఆయన కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉండటం లేదని చెప్తూనే, వచ్చే ఎన్నికల్లో సిద్ధూని ఒడించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. మరో 15 రోజుల్లోనే అమరీందర్ సింగ్ కొత్త పార్టీని స్థాపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తనకు అనుకూలంగా…
అమరీందర్ సింగ్ ఢిల్లీ పర్యటనను ముగించుకొని తిరిగి పంజాబ్ చేరుకున్నారు. పంజాబ్‌లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితిపై ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనని, కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అనిశ్చితి పరిస్థితి నెలకొందని అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీని కోల్పోతే స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇప్పటికే పార్టీలో సిద్ధూని అనేక మంది వ్యతిరేకిస్తున్నారని, నిలకడ లేని మనస్థత్వం కలిగిన…
పంజాబ్‌లో మరో కొత్త పార్టీ ఏర్పడబోతుందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి నుంచి అమరీందర్ సింగ్ పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కకు తప్పుకున్న అమరీందర్ సింగ్, ఢిల్లీలో బిజీగా మారిపోయారు. ఈరోజు కేంద్రంలోని అనేక మంత్రులను, ప్రధాని మోడిని కూడా కలిశారు అమరీందర్ సింగ్. కాగా, ఆయన ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరడం లేదని, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండబోవడం…
పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఏకంగా అమిత్‌షాతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారగా.. ఆయన ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారంటూ ప్రచారం సాగుతోంది.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ అనూహ్య రాజీనామాతో సంక్షోభం ముదిరింది. అమరీందర్, సిద్ధూ మధ్య విభేదాలు పార్టీని నట్టేట ముంచేలా కనిపిస్తున్నాయి.. ఓవైపు సంక్షోభం కొనసాగుతున్న వేళ.. మరోవైపు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర హోంమంత్రి…