విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా వైపు పయనిస్తోందని కాగ్ నివేదిక చెబుతున్నందున.. ఇప్పటికైనా మేధావులు స్పందించాలని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం కోరింది. రానున్న తరాలకు ఆస్తులకు బదులు అప్పులు ఇచ్చే దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులు మూల వ్యయాలకు కాకుండా.. రోజువారీ ఖర్చులకు సరిపోతున్నాయని, అప్పులు చెల్లించడానికి ప్రభుత్వం తిరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం అధ్యక్షుడు నేతి ఉమామహేశ్వరరావు…