గత నెలలో అమలాపురంలో జరిగిన అల్లర్ల కేసులో మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 134 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. అల్లర్ల నేపథ్యంలో గత నెలలో అక్కడ నిలిపివేసిన ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరించారు. గత నెల 24వ తేదీన అమలాపురంలో జరిగిన విధ్వంసం నేపథ్యంలో అధికారులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఇవాళ్టి నుంచి పూర్తి…