మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా సూపర్ డూపర్ హిట్ చిత్రం “నాయక్” రీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన అందాల భామలు కాజల్ అగర్వాల్, అమలాపాల్ నటించిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించగా, డి.వి.వి.దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం అభిమానులతో పాటు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రీ రిలీజ్ అయితే మళ్ళీ చూడాలని ప్రేక్షకాభిమానులు…