మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో కీలక సమరానికి వేళైంది. తొలి సెమీఫైనల్లో ఈరోజు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాను భారత్ ఢీకొట్టనుంది. లీగ్ దశలో ఓడించిన ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో మట్టికరిపించాలని టీమిండియా చూస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు హర్మన్ సేనకు ఓ బ్యాడ్‌న్యూస్. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ఆసీస్ స్టార్ అలైస్సా హీలీ సెమీఫైనల్లో రంగంలోకి దిగనుంది. సెమీఫైనల్లో అలైస్సా హీలీ…