Collectors’ Conference: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాలనను మరింత ప్రజోపయోగంగా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదవ కలెక్టర్ల కాన్ఫరెన్సులో భాగంగా ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు తొలిసారిగా కొత్త విధానాన్ని అవలంభించారు. సాధారణ సమీక్షలకు భిన్నంగా, ఆయా జిల్లాల్లో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కలెక్టర్లే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేలా చేశారు.…