మంగళగిరి నియోజకవర్గంలో బీసీ పద్మశాలికి ఇవ్వాలని పార్టీ భావించిందని గుంటూరు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఆర్కే వ్యక్తిగత పనులు ఉండటం వల్లే పార్టీకి రాజీనామా చేశారని ఆయన వెల్లడించారు. ఆర్కే అంచనాలు కాస్త ఎక్కువే ఉంటాయన్నారు.
మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఉదయం నుంచి వేగంగా మంగళగిరి నియోజకవర్గ రాజకీయాలు మారుతున్నాయి. మంగళగిరి పంచాయతీ తాడేపల్లికి చేరింది.