కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి… అయితే, కరోనా సెకండ్ వేవ్ కల్లోలం నుంచి కోలుకుంటూ.. క్రమంగా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో.. తిరిగి స్కూళ్లను తెరిచేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.. అందులో భాగంగా.. ఎల్లుండి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది పంజాబ్ ప్రభుత్వం.. ఆగస్టు 2వ తేదీ నుంచి పాఠశాలల తెరవాలంటూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది పంజాబ్ సర్కార్..…