Afghanistan: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు నెమ్మదిగా బలపడుతున్నాయి. ఇటీవల, ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో కొన్ని రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. అయితే, ఈ పరిణామాలను పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. భారత్ పర్యటను ముత్తాఖీ వచ్చిన రోజే కాబూల్‌పై వైమానికి దాడికి తెగబడింది.