రంజాన్ పండగ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈద్, అక్షయ తృతీయ వంటి రాబోయే పండుగల దృష్ట్యా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశించింది.