నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ మూవీ టాలీవుడ్‌కు ఊపిరి పోసిందని చిత్ర ప్రముఖులందరూ భావిస్తున్నారు. తాజాగా అఖండ సినిమాపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. అఖండ మూవీని తాను ఇటీవల చూసినట్లు చంద్రబాబు ఈరోజు ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. మంగళగిరి టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన బాబు.. ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయనేది అఖండ సినిమాలో చూపించారని చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారని… సినిమా చాలా…
నటసింహం నందమూరి బాలకృష్ణ “అఖండ” థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమాతో “అఖండ” జాతర జరుపుకుంటున్నారు. సినిమా విడుదలై మూడు నాలుగు రోజులు అవుతున్నా ప్రేక్షకుల నుంచి ఏమాత్రం ఆదరణ తగ్గలేదనే చెప్పాలి. ఇలా ఒకవైపు హీరో బాలకృష్ణ “అఖండ” చిత్రంలో తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో వెండితెరపై ఫైర్ సృష్టిస్తుంటే… మరోవైపు “అఖండ” ప్రదర్శితం అవుతున్న మరో థియేటర్లో నిజంగానే అగ్ని ప్రమాదం…
‘అఖండ’ సినిమా విడుదల అనంతరం నందమూరి ఎన్టీయార్ తనయుడు, మనుమలు, వారసులు ఒక్కక్కరూ ఆ సినిమాపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. నందమూరి బాలకృష్ణతో ‘పెద్దన్నయ్య, గొప్పింటి అల్లుడు’ చిత్రాలను నిర్మించిన తమ్ముడు నందమూరి రామకృష్ణ సైతం తన స్పందన తెలిపారు. ఆయన విడుదల చేసిన ప్రకటన ఇది: ”గత ఒక సంవత్సరము నుండి ఎపుడా ఎపుడా అని ఎదురుచూస్తున్న’ అఖండ’ సినిమా ప్రేక్షకాదరణ పొంది విజయ పతాకం రెపరెప లాడుతూ విజయ శంఖముతో విజయముగా ప్రదర్శింపబడుతున్నది. మళ్లీ…
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీగా రూపొందిన “అఖండ” ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు, శ్రీకాంత్ వంటి సీనియర్ హీరోలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ తోనే ఈ సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తేసిన ‘అఖండ’ నందమూరి అభిమానులకు మాస్ ఫీస్ట్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు నెటిజన్లు.…
నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి “అఖండ”. ఈ భారీ యాక్షన్ డ్రామాకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. “సింహా”, “లెజెండ్” వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలకృష్ణ దర్శకుడు, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ. తాజా సమాచారం ప్రకారం “అఖండ” చిత్రీకరణ పూర్తయింది. 10 రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ కంప్లీట్ చేసేశారు. స్టంట్ కో-ఆర్డినేటర్ స్టన్ సిల్వా…