మహారాష్ట్రలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఔరంగాబాద్ లో జరిగిన సమావేశంలో తాజా రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. ఇటీవల కాలంలో మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల వివాదం చెలరేగుతోంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే, శివసేన సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీయకుంటే… వాటి ముందే మేం హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ వివాదం…
హేట్ స్పీచ్ కేసులో అక్బరుద్దీన్ ఓవైసీని నిర్ధోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ కేసును కావాలనే నీరుగార్చారని ఆరోపించారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కుమ్కక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి..? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఈ మూడు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని, నిర్మల్ కేసుపై తక్షణమే అప్పీల్ కు వెళ్లాలని డిమాండ్ చేశారు.…
మజ్లిస్ కీలక నేత, తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ద్వేషపూరిత ప్రసంగం కేసులో భారీ ఊరట లభించింది. 2012 డిసెంబర్‌లో హిందువులను ఉద్దేశించి అక్బర్ తీవ్ర వ్యాఖ్యలుచేశారు. నిజామాబాద్, నిర్మల్‌లో చేసిన వ్యాఖ్యలపై ఒక వర్గం తీవ్రంగా స్పందించింది. ఆయన పై కేసులు నమోదయ్యాయి. అక్బరుద్దీన్‌పై రెండు కేసులనూ నాంపల్లి సెషన్స్ కోర్టు బుధవారం నాడు కొట్టవేస్తున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 2012 డిసెంబర్ నెలాఖరులో ఆదిలాబాద్,…
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసుల్లో ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం.. ద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన 2012 కేసుల్లో తీర్పు వెల్లడించనుంది.. కాగా, పదేళ్ల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్బరుద్దీన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ కేసు నమోదు చేశారు.. ఇక, ఈ కేసులో నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ ముగించింది.. ఈ కేసులో 30 మందికిపైగా సాక్షులను విచారించింది కోర్టు.. అదే విధంగా ఆ…