విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో విమానాలు ప్రమాదభారిన పడుతున్నాయి. తాజాగా చైనాలో విమాన ప్రమాదం ప్రయాణికులను వణికించింది. విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. హ్యాన్జూ నుంచి సియోల్ వెళ్తుండగా ఎయిర్ చైనా విమానం (CA139)లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్యాసింజర్ క్యాబిన్ బ్యాగులో ఉన్న లిథియం బ్యాటరీ పేలి మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.…