Tamil Nadu: తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతున్న వేళ, ఏఐడీఎంకే కీలక అడుగు వేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళణిస్వామి తొలిసారి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజల దైనందిన జీవనానికి నేరుగా ఉపయోగపడేలా ఐదు ప్రధాన హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. మహిళల సంక్షేమాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటూ, ప్రతి మహిళకు నెలకు రూ.2,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా పథకం అమలు…