Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ దేశంలోనే తొలిసారి ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాలనను మరింత సాంకేతికతతో కూడిన, పారదర్శకంగా చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని భారతీయ సాంకేతిక సంస్థ (IIT) కాన్పూర్ ప్రొఫెసర్లు నిర్వహించనున్నారు. శిక్షణ తరగతులు ఆగస్టులో జరగనున్న మాన్సూన్ సమావేశం మధ్యలో లేదా చివరిలో ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా AI శిక్షణా…