WhatsApp: వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ని విడుదల చేసింది. దీని ద్వారా వినియోగదారులు తమ వీడియో కాల్స్‌ను మరింత ఆకర్షణీయమైన విధంగా మార్చుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ Meta AI ద్వారా పనిచేస్తుంది. వినియోగదారులు తమకు అనుగుణంగా ఉండేలా ప్రాంప్ట్‌లు, సందేశాల ఆధారంగా వివరించినప్పుడు, Meta AI ఆ వివరాల ఆధారంగా ప్రత్యేకమైన బ్యాక్ గ్రౌండ్ లను వెంటనే తయారుచేస్తుంది. “కెమెరా ముందు మీరు మరింత సౌకర్యవంతంగా ఉండటానికి, అలాగే సరదాగా మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోవడానికి…