Sabarmati Central Jail: గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి కీలక వార్తలు వెలువడ్డాయి. రిసిన్ పాయిజన్‌తో ప్రజలను హత్య చేయడానికి కుట్ర పన్నిన హైదరాబాద్‌కి చెందిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను తోటి ఖైదీలు చితకబాదారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP)తో సంబంధం ఉన్న ఉగ్రవాది డాక్టర్ అహ్మద్‌పై జైలు లోపల దాడి జరిగింది. హై సెక్యూరిటీ సెల్‌లో బంధించినప్పటికీ ఇతర ఖైదీలు అకస్మాత్తుగా అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.