Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ బస్సు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది చిన్నారులు, 12 మంది మహిళలు సహా 25 మంది మరణించినట్లు సమాచారం.
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఓ విద్యాకేంద్రం వద్ద భారీ పేలుడు సంభవించింది.
Kabul Blast: వరుస పేలుళ్లతో అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. కాబూల్ నగరంలో నిన్న సాయంత్రం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మసీదులో భారీ పేలుడు సంభవించింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో బుధవారం సాయంత్రం తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. ఈఘటనతో అఫ్గానిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానిక ఖైర్ ఖానా ప్రాంతంలోని ఓ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఈభారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మసీదు…