ఏపీ రాజకీయాల్లో వంగవీటి రాధా ఎపిసోడ్ హాట్ టాపిక్ అవుతోంది. తన హత్యకు కుట్ర జరుగుతోందని, రెక్కి నిర్వహించారని రాధా కామెంట్ చేయడంతో అసలేం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. తాజాగా వంగవీటి రాధా వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వంగవీటి రాధాకు చంద్రబాబు ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాధాపై రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై ఆరా తీశారు చంద్రబాబు. రాధా తనకు కేటాయించిన గన్ మెన్లను తిరస్కరించడం సరి కాదన్నారు చంద్రబాబు. వ్యక్తిగత భద్రత…